డెంగ్యూ వ్యాధిని నివారించేలా ప్రజల్లో అవగాహనా డాక్టర్ భాను ప్రకాష్ :-
డెంగ్యూ వ్యాధిని నివారించేలా ప్రజలకు అవగాహన- డాక్టర్ భాను ప్రకాష్
ఓ.డి. చెరువు మే (జనచైతన్య న్యూస్) మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ప్రాంగణంలోజాతీయ డెంగ్యూ దినోత్సవసం జరుపుకొని, సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు అని ఇందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ పేర్కొన్నారు.జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం నందు ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల,కాలానుగుణంగా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగ్యూ వ్యాధి అతి ప్రమాదకర,ప్రాణాంతకమైనది అని పలు సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.టైగర్ దోమగా కూడా పిలువబడే ఒక రకమైన దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పరిసరాల అపరిశుభ్రత ముఖ్యం నిలువ ఉండే మంచినీరు,వర్షపు నీరు,ఇళ్లలోని వాడకంలో లేని రోలు, రబ్బరు టైర్లు,టెంకాయ చిప్పలు, పాత డబ్బాలు,కుండలు మొదలగు వాటిలో నిలువ ఉండే వర్షపు మంచినీటిలో ఈ దోమలు గుడ్లు పెట్టి అనంతర పరిణామం లో పెద్ద వైన దోమలు అనారోగ్య వంతుని కుట్టి తిరిగి ఆరోగ్యవంతులను కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వ్యాధి లక్షణాలలో ముఖ్యంగా ప్రాథమిక దశలో విపరీత తలనొప్పితో కూడిన జ్వరము, రెండవ దశలో శరీరంపై నీలిరంగు దద్దులు,మూడవ దశలో మెదడులోని రక్తనాళాలు చిట్లి రక్తంలోని ప్లేట్లెట్స్ మోతాదు విపరీతంగా వేగంగా తగ్గి డెంగ్యూ హేమరేజ్ లక్షణంతో చనిపోవడం జరుగుతుందని కనుక పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రై డే నియ మాలు పాటిస్తూ నీటి నిలువలను తొలగించడంలో సామాజిక చైతన్యం పెంపొందించుకొని అందరూ భాగస్వాములైనప్పుడు ఈ డెంగ్యూ వ్యాధిని నివారించి వచ్చని సూచించారు అనంతరం డెంగ్యూ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ మరియు మనోహరం నిర్వహించారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్,డాక్టర్ కమల రోహిత్,ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.