వయోజనులకు టీబీ నివారణ టీకాలు
వయోజనులకు టిబి నివారణ టీకాలు.
సత్యసాయి జిల్లా అమడగూరు మే (జనచైతన్య న్యూస్)మండలం లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వయోజనులకు టీబి (క్షయ) వ్యాధి నివారణకు బిసిజి ఉచిత టీకాలు, గురువారం టీబి నివారణకు ఉచిత టీకాలను ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ అపర్ణ ఆధ్వర్యంలో టీకాలు వేసినట్లు తెలిపారు.60 సంవత్సరాలు పైబడిన వారికి,గతంలో టిబి సోకినవారికి కుటుంబ సభ్యులకు,ధూమపానం సేవించు వారికి చక్కెర వ్యాధి ఉన్నవారికి బి.ఎం.ఐ 18 కన్న తక్కువ ఉన్న,వారికి బి సి జి వ్యాక్సిన్లు వేసినట్లు ఆమె తెలిపారు మండల వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్లు ప్రజలు వేయించుకోవాలని సూచించారు, ఇప్పటివరకు ఈ వ్యాక్సినేషన్ను 51 మందికి వేసినట్లు తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ అపర్ణ,సీ.హెచ్.ఓ.ఫక్రుద్దీన్,సూపర్వైజర్ ,నాగమ్మ, ఏఎన్ఎం నాగలక్ష్మి, ఆశా వర్కర్లు, ఎం లత, ఎం అలివేలమ్మ, నాగమణి, రామలక్ష్మి, తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు