ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు ని మర్యాదపూర్వకంగా కలిసిన కదిరి విద్యుత్ శాఖ కాంటాక్ట్ ఎంప్లాయిస్ బి 2841, యూనియన్ కదిరి డివిజన్ ప్రెసిడెంట్ అంకె లోకేష్,కాంటాక్ట్ కార్మికులు
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు ని మర్యాదపూర్వకంగా కలిసిన కదిరి విద్యుత్ శాఖ కాంటాక్ట్ ఎంప్లాయిస్ బి 2841, యూనియన్ కదిరి డివిజన్ ప్రెసిడెంట్ అంకె లోకేష్,కాంటాక్ట్ కార్మికులు
జనచైతన్య న్యూస్- కదిరి
సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో విద్యుత్ శాఖలో ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంస్థలనే నమ్ముకుని క్రమబద్ధీకరణకు కొరకు అనేక రకాల ప్రయత్నాలతో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014-2019 ప్రభుత్వ పరిపాలన సమయంలో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ పో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన రెగ్యులర్ ఉద్యోగులకు అమలులో ఉన్న మూలవేతాన్ని కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేయడానికి, విద్యుత్ సంస్థలో అమలులో ఉన్న దళారి వ్యవస్థను రద్దు చేసే విద్యుత్వం సంస్థల ద్వారా నేరుగా వేతన చెల్లింపు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రిన్సిపుల్ సెక్రెటరీ వారికి, 30 అక్టోబర్ 2017 పంపిన ప్రతిపాదనలను అనుసరించి వెంటనే అమలు చేయాలి. గతంలో జరిగిన పిఆర్సి లలో రెగ్యులర్ ఉద్యోగులకు ఏమైనా పెండింగ్ బకాయిలు చెల్లించిన విధంగానే కాంటాక్ట్ కార్మికులకు కూడా ఇచ్చేవారు.
కానీ 2022 పిఆర్సి అనుసరించి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన అరియర్స్ ను కాంట్రాక్ట్ కార్మికులకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు, కావున ఇందుకు సంబంధించి త్వరగా ఆదేశాలు ఇవ్వవలెనని కోరుతున్నాము. గత ప్రభుత్వ పరిపాలనలో విద్యుత్ రంగంలో ఒకే కేడర్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా మూడు రకాల వేతనాలు ఇస్తున్నారు ( ఒక సబ్ స్టేషన్ లో నాలుగు షిఫ్ట్ ఆపరేటర్స్ పని చేస్తుంటే మూడు రకాల వేతనాలు ఇస్తున్నారు ) ఇది నిరంతరం ప్రమాదకరమైన పని ప్రదేశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర మనస్థాపానికి గురిచేస్తుంది, కావున దయవుంచి ఓకే కేడర్లు పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వెతన వ్యత్యాసాన్ని సమాన పరచావలసినదిగా కోరుతున్నాము.