ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు

 జనచైతన్య న్యూస్- అనంతపురం

 అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గిరిజన భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కి స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే వీరాంజనేయులు మాట్లాడుతూ, గిరిజనులు అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో విద్య, వైద్యం, రోడ్లు,మంచినీరు, సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 6% ఉన్న రిజర్వేషన్ శాతాన్ని ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, గురుకులంలో చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు అదనంగా సీట్ల సంఖ్య పెంచి హాస్టల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని, గత ప్రభుత్వం రద్దు చేసిన 18 గిరిజన పథకాలను తిరిగి యధావిధిగా కొనసాగించాలని, గిరిజన సమస్యలు పరిష్కరించే దిశగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఎరుకల జాతి ఆణిముత్యం, ఏకలవ్యుని జయంతిని అధికారికంగా నిర్వహించాలని అధికారులను కోరడం జరిగింది. పైన తెలిపిన సమస్యలను కలెక్టరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాలు నాయకులు సాకే చిరంజీవి ఉమామహేశ్వరి పోల మహేష్, గుజ్జుల లక్ష్మణ్, సాకే గాయత్రి, కేశవనాయక్, మహేష్ నాయక్, శివ శంకర్ నాయక్, మల్లికార్జున నాయక్, రవీందర్ నాయక్, పోలవీర గంగాధర్, మారుతి, వెంకటేష్,  కేశవ తదితరులు గిరిజన కులస్తులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.