విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేసిన చంద్రశేఖర్ రెడ్డి
విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేసిన చంద్రశేఖర్ రెడ్డి
జనచైతన్య న్యూస్-పుట్లూరు
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు ఉన్న 250 మంది విద్యార్థులకు టిడిపి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, మెండర్లు సోమవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇష్టపడి, కష్టపడి, చదివితే ఉత్తమ ఫలితాలను రాబట్టగలమన్నారు. అదేవిధంగా చదువుకునే పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో మంచిదని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు చంద్ర శేఖర్ రెడ్డి కి ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.