గ్రామంలో నీటి కోసం అవస్థలు పట్టించుకోలేని అధికారులు
శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం బలేపల్లి తాండ పంచాయతీ,బాలేపల్లి దిగువ తండా లో నీటి సమస్య గత మూడు నెలల నుంచి ఉన్నది. అందువలన గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున వెంటనే అధికారులు ఈ నీటి సమస్య పై వెంటనే స్పందించి గ్రామ ప్రజలను ఆదుకోవాలని బాలేపల్లి తండా గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఈ సమస్యను అధికారుల ముందు ఉంచటానికి బిజెపి ఎస్టి మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ మూడే గణేష్ నాయక్, బి రామకృష్ణ నాయక్, బి మంజునాథ నాయక్ ,m.కుమార్ నాయక్, తారక్ నాయక్, గ్రామ ప్రజలతో సహా పాల్గొన్నారు.