నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి-అవినాష్

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి-అవినాష్

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి దేవినేని అవినాష్

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.ఆదివారం నాడు అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని వైద్య సేవలు పొందిన వారు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అర్జీలు పెట్టుకోగా నియోజకవర్గ పరిధిలోని  5వ డివిజన్ కి చెందిన తోట లక్ష్మి రూ.85,000/-, 6వ డివిజన్ కి చెందిన రుద్రా పల్లంరాజు  రూ.75,000/-, 9వ డివిజన్ కి చెందిన కనకాల శివ రాణి లకి రూ.1,40,000/- మంజూరు కాగా లబ్దిదారులకు చెక్కులను అవినాష్ అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్య శ్రీ పధకం ప్రవేశపెట్టడం జరిగింది అని,ఈ పధకం కింద మన రాష్ట్రంలో నే కాకుండా, పొరుగు రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్యం చేపించుకోడానికి వీలు కల్పించారు అని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్  అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగాలకు వారి చికిత్స కు అయిన నగదు మొత్తం హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్జి పెట్టుకొంటే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ నాలుగు ఏళ్ల కాలంలోనే కోట్ల  రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకోవాలి అంటే తెలుగుదేశం నాయకులు కి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి అని,కానీ ఇప్పుడు ఎవరికి లంచాలు ఇవ్వకుండా పారదర్శకంగా పధకం అమలు  జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,దేవినేని క్రాంతి,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్,6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,9వ డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.