పదిరూపాయలు నాణేలు తీసుకోకపోతే చట్టరీత్యా చర్యలు
పదిరూపాయలు నాణేలు తీసుకోకపోతే చట్టరీత్యా చర్యలు
(జన చైతన్య న్యూస్) బెంజ్ సర్కిల్ లోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నందు కస్టమర్స్ కు పది రూపాయల కాయిన్స్ ను సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దారు సింగ్ నాయక్ బ్యాంకు ఉద్యోగస్తులు కలిసి నగరవాసులు పంపిణి చేసి అవగాహన కల్పించారు. మార్కెట్లో పది రూపాయల కాయిన్ చెల్లుతుందని ఎవరైనా కాయిన్ తీసుకొని పక్షంలో వారి పై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ దారు సింగ్ నాయక్ స్పష్టం చేసారు. పది రూపాయల నాణేలను నిరాకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ఆర్‌బీఐ ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటెయిల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో బెంజ్ సర్కిల్ లోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నందు కస్టమర్స్ కు పది రూపాయల కాయిన్స్ ను పంపిణి చేసామని, దారు సింగ్ నాయక్ తెలిపారు . పది రూపాయల నాణెం చెల్లదనే అపోహ ప్రజల్లో చాలా బలంగా ఉంది, ఇది ఎలా మొదలైందో తెలియదుగానీ, పది రూపాయల నాణెం చెల్లదనే వాదన జనాల్లో బలంగా నాటుకుపోయింది, పది రూపాయల నాణెం చెల్లదనేధీ వాస్తవం కాదన్నారు, పది రూపాయల కాయిన్స్ మార్కెట్లలో చెల్లుతాయని అన్నారు. ఎవరైనా కాయిన్ తీసుకొని పక్షంలో వారి పై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు, పది రూపాయల నాణేలను నిరాకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాయిన్స్ పంపిణి చేస్తున్నామని అన్నారు, పది రూపాయల నోట్లు చేతులు మారే కొద్దీ త్వరగా పాడవుతుంటాయని ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్‌బీఐ, మిగతా నాణేలతోపాటు కొన్నేళ్లుగా రూ.10 నాణేలనూ ముద్రిస్తూ వస్తోందన్నారు, పది రూపాయల కాయిన్ చెలామణి అవుతుందని ఆయన స్పష్టం చేశారు, ఆర్బీఐ పది రూపాయల కాయిన్ను నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసిందన్నారు.