జేసి అనుచరుడిపై హత్యాయత్నం వేట కొడవళ్లతో విచక్షణారహితంగా

జేసి అనుచరుడిపై హత్యాయత్నం వేట కొడవళ్లతో విచక్షణారహితంగా

తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్‌పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కిరణ్‌ను వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికివేశారు.కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని ఇతర ప్రాంతాలకు పోలీసులు తరలించారు. నిన్న రాత్రి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సైతం వేరే ప్రాంతానికి పోలీసులు పంపించారు. తాడిపత్రిలో పారామిలటరీ బలగాలతో పాటు వందల సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం జరగడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.