పుట్టపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి

పుట్టపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి

పుట్టపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా:దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి 

విద్యార్హత: బీఎస్సీ(మైక్రోబయాలజీ), ఎంబీఏ

కుటుంబం వివరాలు: తండ్రి: దాది రెడ్డి సూర్యనారాయణ రెడ్డి, తల్లి అనసూయమ్మ , భార్య, డా.వైశాలినీ తన్విజ, (దంత,చర్మ,హెయిర్ వైద్య నిపుణురాలు, హైదరాబాద్), ఒక కుమారుడు ఉన్నారు. వృత్తి: సీనియర్ మేనేజర్,సాప్ట్ వేర్ కంపెనీ.గ్రామం: ఎ.కొత్తపల్లి,

అమడగూరు మండలం, పుట్టపర్తి నియోజకవర్గం, శ్రీ సత్యసాయి జిల్లా

కుటుంబ నేపథ్యం: 

సాధారణ రైతు కుటుంబం లో జన్మించిన

మధుసూధన్ రెడ్డి, తల్లి, తండ్రి కష్టంతో చదువుకొని అనంతపురంలోని ఎస్ఎస్ బి ఎన్ ఆటానామస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మైక్రోబయాలజీ, ఆపై మైసూరులో ఎంబీఏ పూర్తి చేశారు.తర్వాత ఉద్యోగ రీత్యా లండన్ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చారు.

*రాజకీయ నేపథ్యం:-*

దాదిరెడ్డి మధుసుధన్ రెడ్డి 

కుటుంబం ముందు నుండి కాంగ్రేస్ పార్టీలో కీలకంగా ఉండేవారు‌. వైఎస్సార్ మరణం అనంతరం వైసిపి పార్టీలో చేరారు.

వైఎస్సార్ వీరాభిమాని, 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరి వైఎస్సార్సీపీ జిల్లా ' యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అమడగూరు మండలంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేశారు. పలువురు విద్యార్థులకు ఆర్ధిక చేయూత, పలు సేవాకార్యక్రమాల ద్వారా గుర్తింపు " పొందారు.

అయితే వైఎస్ షర్మిల కాంగ్రేస్ పార్టీలో చేరడంతో  మాజీమంత్రి రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిళ సమక్షంలో జనవరి 30 న ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల తీరును ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై గళమెత్తి వార్తల్లో నిలిచారుప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం**

తాను ప్రజల కోసమే రాజీకీయాల్లోకి వచ్చాను.పుట్టపర్తి నియోజకవర్గం కర్ణాటక సరిహద్దు మండలాలు కావడంతో ఇక్కడ ప్రజలు ఉపాధి లేకబెంగుళూరు,హైదరాబాదు ,చెన్నై,తదితర ప్రాంతాలకు వలసలు వెల్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.కావున వలసలను నివారించడానికి పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రజలు వలసలు వెల్లకుండా నివారించడమే తన లక్ష్యమన్నారు.అంతేకాక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని పారదోలుతామన్నారు.అదే విధంగా గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఏరోజు కూడా ప్రజలకు అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడే వైఎస్ షర్మిళమ్మ నాయకత్వంలో భవిష్యత్ ఉంటుందని నమ్మాను. వాళ్లు నన్ను నమ్మి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిళ, రఘువీరారెడ్డి, నాగరాజరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే నా ఎంపికకు కృషి చేసిన నియోజకవర్గం మండల కన్వీనర్లకు,నాయకులకు,కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.