వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు
కదిరి: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆపాలన్న కక్షతో జత కట్టిన కౌరవ సంఘం ఒకవైపు రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న పాండవ సైన్యం మరోవైపు అనే విధంగా ధర్మ యుద్ధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కదిరి నియోజకవర్గంలో గతంలో కంటే అత్యధిక మెజారిటీతో మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని పేర్కొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..