నగరాల కులాల సాక్షిగా పోతిన మహేష్ కి జనసేన టిక్కెట్టు ఇవ్వాలి

నగరాల కులాల సాక్షిగా పోతిన మహేష్ కి జనసేన టిక్కెట్టు ఇవ్వాలి

విజయవాడ పశ్చిమ టిక్కెట్ పోతిన మహేష్ కి ఇవ్వాలి.....

పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో నాయకుల డిమాండ్

విజయవాడ పశ్చిమ _ జన చైతన్య (తమ్మిన గంగాధర్) 

రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన నాయకులు పోతిన మహేష్ కు కేటాయించాలని మంగళవారం రాత్రి చిట్టినగర్ లోని అమ్మవారి కళ్యాణమండపం లో జరిగిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే పోతిన మహేష్ అన్నంతగా ప్రజల్లో మహేష్ పేరు సంపాదించారని చెప్పారు. ఈ ఎన్నికల్లో 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలవాలంటే అది పోతిన మహేష్ వల్లేసాధ్యపడుతుందని వక్తలు అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికి  మహేష్ తిరిగారని, అందరి అభిమానాన్ని చూరగొన్నారని వారు వివరించారు. ఈ సమావేశంలో చిట్టినగర్ అమ్మవారి గుడి అధ్యక్షులు లింగి పిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, నగరాల సంఘం నాయకులు పోతిన బేసి కంటేశ్వరుడు, గుజ్జారి అమర్, తమ్మిన హేమంత్, రాంపిళ్ల శ్రీనివాస రావు , పిళ్ళా శ్రీనివాసరావు( పీసీ), లింగిపిల్లి రామకృష్ణ, సుఖాసి కిరణ్, ప్రముఖ న్యాయవాది గోగిశెట్టి వెంకటేశ్వరరావు, తదితరులు పోతిన మహేష్ కి మద్దతుగా ప్రసంగించారు. ఈ సమావేశంలో చివరలో పాల్గొన్న పోతిన మహేష్ మాట్లాడుతూ తన పట్ల అభిమానాన్ని చాటిచెప్పిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.