మాన్యం మందకృష్ణ మాదిగ సైన్యం తాడపత్రి
మాన్య మందకృష్ణ మాదిగ సైన్యం తాడిపత్రి
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం లో మాదిగల ఆత్మగౌరవ కవాతును జయప్రదం చేయండి. మహాజన నేత మాన్య మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు 7 జులై 2024 ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం, వరంగల్ లో లక్షలాది మంది మాదిగల తో మాదిగల ఆత్మగౌరవ కవాతు మరియు బహిరంగ సభ జరుగును, ఈ సభను జయప్రదం చేయటంలో భాగంగా పెద్దపప్పూరు గ్రామంలో ఆర్డిటి కాలనీలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ, తాడపత్రి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తబ్జుల్లా రామాంజనేయులు మాదిగ ఆధ్వర్యంలో 27 జూన్ 2024 న పెద్దపప్పూరు గ్రామంలో ఆర్డిటి కాలనీలో ఇంటింటికి తిరిగి అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ జులై 7న వరంగల్ లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు మరియు సభకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామము నుండి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ అధ్యక్షుడు టి వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడు డి నరహరి, మధుబాబు, తబ్జులా మహేష్, దావీదు, కొట్టం రామాంజనేయులు, కే గంగన్న, ఎట్టి చిన్నా నారాయణ, జూటూరు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.