పుట్టపర్తి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన అభ్యర్థి
పుట్టపర్తి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన అభ్యర్థి
జనచైతన్య న్యూస్ - పుట్టపర్తి
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పుట్టపర్తి ఆర్డిఓ కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల రామాంజనేయులు యాదవ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయడానికి వినూత్న రీతిలో బయలుదేరి వెళ్లారు. ఆయన ఎద్దుల బండికి పచ్చని తోరణాలు కట్టి ఆ బండి పై నామినేషన్ వేయడానికి సత్యమ్మ గుడి కాడ నుండి గణేష్ సర్కిల్ వరకు డప్పు వాయిద్యాలతో ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఆర్డిఓ భాగ్య రేఖకు నామినేషన్ పత్రాలు అందజేశారు.