కిషన్ మోర్చా ఆర్గానిక్ పార్కింగ్ రాష్ట్ర కన్వీనర్ గా శరత్ కుమార్ రెడ్డిని నియమించడం జరిగింది
శ్రీ సత్యసాయి జిల్లా అమడగురుమండలం తుమ్మల గ్రామం వెంకటనారాయణ పల్లిలో చింత శివారెడ్డి పద్మావతమ్మ దంపతుల నాలుగవ సంతానం జన్మించిన చింత శరత్ కుమార్ రెడ్డి విద్య అభ్యాసం తుమ్మల హైస్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల బాయ్స్ కదిరి ప్రభుత్వం డిగ్రీ కళాశాల కదిరి న్యాయవిద్య ఉస్మానియా యూనివర్సిటీ లో పూర్తి చేశారు హై స్కూల్ స్థాయి నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రేరణతో 1998 లో జాతీయ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో చేరి అనేక విద్య రంగ సమస్యలను పోరాటం చేస్తూ విద్యార్థులను జాతీయ భావాలు వైపు నడిపించడంలో ముందున్నారు కదిరి కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలను నాయకత్వం వహిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు , 2002 నుండి ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తగా కరీంనగర్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలను నాయకత్వం వహిస్తూ అనేకమంది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తు వారిలో జాతీయ భావాలు కల్పిస్తూ పని చేయడం జరిగింది .తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, అనేక జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి చింత శరత్ కుమార్ రెడ్డి.2010 నుండి జర్నలిస్టుగా పనిచేయడం జరిగింది, ఇండియన్ వాయిస్ దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు. విద్యార్థుల్లో రాజకీయాలకు రావాలని ఉద్దేశంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది.
2015 నుండి కదిరి కేంద్రంగా సేవా భారతి కార్యదర్శిగా ఈ ప్రాంతంలో చాలా గ్రామాలలో మంచినీటి సౌకర్యం లేని గ్రామాలు ట్యాంకులతో నీటి సరఫరా చేయడం, పసు గ్రాసం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పశువులకు పశుగ్రాసం పంపిణీ చేయడం జరిగింది. సేవ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాధవ గురుకులం వ్యవస్థాపకులుగా ఉండి అమ్మానాన్న లేనటువంటి అనేకమంది విద్యార్థులకు ఈరోజు ఒక ఆసరాగా మాధవ గురుకుల ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం రాజధాని కి రైలు సౌకర్యం లేదని గ్రహించి రైలు సాధించాలనేటువంటి సంకల్పంతో ప్రజా ఉద్యమం నిర్మాణం చేసి విద్యార్థి ,ఉపాధ్యాయ కార్మిక ,రాజకీయ, మేధావులతో సంతకాల సేకరణ చేసి ఢిల్లీ వెళ్లి కదిరి మీదుగా మచిలీపట్నం వెళ్తున్న రైలు సాధించడంలో శరత్ కుమార్ రెడ్డి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉన్నది, ఈ ప్రాంతంలో ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్న రైలు నడుస్తున్నది అంటే అది శరత్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమైందని చెప్పాలి , శ్రీ విజ్ఞాన్ విద్యాసంస్థలలో వృత్తి విద్య కోర్సులు ఏర్పాటుచేసి వందలాది మంది విద్యార్థులు ఉపాధి కల్పించడం జరిగింది. కదిరి ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్నదని ఈ ప్రాంతం సస్యములు కావాలంటే హంద్రీనీవా సృజల స్రవంతి ద్వారా ప్రతి చెరువును నింపాలని కోరుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. 15 సంవత్సరాల పాటు విద్యార్థి నాయకునిగా పది సంవత్సరాలు గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉంటూ యువకుడు విద్యావంతుడు అయినా శరత్ కుమార్ రెడ్డి గారికి జాతీయస్థాయిలో అనేకమంది నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడు . ఆంధ్రప్రదేశ్లో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా శరత్ కుమార్ రెడ్డి నియమించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలలో ప్రజలలో వస్తున్న ఆరోగ్య సమస్యలను మార్పులు ఆహారంలో వస్తున్న మార్పులు వీటన్నిటికీ కారణం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మాని యాంత్రికరణ ద్వారా వ్యవసాయం చేయడంతో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన సన్నగిల్లుతుందని వాటిని అవగాహన కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచి మంచి ఆహార ఉత్పత్తుల తయారుచేసి ప్రజలకు చేరువేందుకు కృషి చేస్తానని ముఖ్యంగా చదువుకున్నటువంటి యూత్ యువకులను ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్లించి వ్యవసాయం అన్నది భారం కాకుండా వ్యవసాయం ప్రజలకు దగ్గర చేసేది కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా తనపై ఉంచిన నమ్మకాన్ని తన నియమకం సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి గారికి, తెరాస ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు జిమ్ శేఖర్ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ఇంచార్జ్ బాలకృష్ణ యాదవ్ గారికి, జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ గారికి, కిషన్ మోర్చా అధ్యక్షులు కేశవ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.