బోండా ఉమా ఆధ్వర్యంలో టిడిపి 2024 క్యాలండర్ ఆవిష్కరణ
మొగల్రాజపురం లోని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు నివాసం
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
సెంట్రల్ నియోజకవర్గ నాగవంశ అద్యక్షులు రాబిల్లి పైడి రాజు ఆధ్వర్యంలో 2024 క్యాలండర్ ఆవిష్కరణ జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టిడిపి పోలిట్ బ్యూరోసభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలు, దళితుల్ని బలపరిచినప్పుడే నిజమైన సామాజిక న్యాయం అమలవుతుంది అని, 151 మందిని మార్చినా తన ప్రభుత్వం రాదు గెలిచే ప్రసక్తే లేదు. రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లు కొనసాగి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేది. ప్రజల జీవనప్రమాణాలు పెరిగేవి అని
ప్రభుత్వం అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి భవిష్యత్ కు దారిచూపాలి కానీ ఈ ప్రభుత్వం మన జీవితాలతో ఆడుకుంటోంది అని తప్పకుండా రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని బోండా ఉమా గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టిడిపి రాష్ట్ర నాగ వంశ సాధికార కన్వీనర్ ఎరుబోతురమణారావు,ఘంటా కృష్ణమోహన్, రాబిల్లి.సూర్య నారాయణ, ఎరుబోతు.రమణ రావు,మొఖర.ఆది బాబు,మొఖర. సోమినాయుడు, అవనాపు.శ్రీను, వేంపటాపు.దుర్గా ప్రసాద్, బెవర.రమణ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.