.ఘనంగా జ్యోతి రావు పూలే 198 వ జయంతి వేడుకలు.

.ఘనంగా జ్యోతి రావు పూలే 198 వ జయంతి వేడుకలు.

..ఘనంగా జ్యోతి రావుపూలే 198 వ జయంతి వేడుకలు..

(పుట్లూరు జనచైతన్య న్యూస్)..

 పుట్లూరు మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామంలో స్వేరో నెట్వర్క్ లో పనిచేస్తున్న బాల అంకన్న ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావుపూలే 198 వ జయంతి వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించారు.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి జ్యోతి రావుపూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బాల అంకన్న మాట్లాడుతూ భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికి కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవ కారుడు జ్యోతి రావుపూలే అన్నారు.అంతేకాకుండా భార్యా సావిత్రి భాయ్ కి చదువు చెప్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చేసిన ఘనత జ్యోతి రావు కు దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో బాల అంకన్న,శివన్న, సాయి, అనిల్, శివ,పెద్దిరాజు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.