విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో-బోండా ఉమా
విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయసమావేశంలో -బోండా ఉమా
విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)
అజిత్ సింగ్ నగర్ షాదీ ఖానా నందు సెంట్రల్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పాలిటి బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు మరియు విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జి కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ , ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం లో ఏ రకంగా విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతకు కృషిచేశాము.గుర్తుచేస్తూ ,ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వబ్రాహ్మణులను పట్టించుకోకపోవడం ఏ కాకుండా వారికి కేటాయించినటువంటి నిధులను కూడా తప్పుదోవ పట్టించి వారు ఆర్థికంగా స్థిరపడేటువంటి అవకాశం లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నదిని,అలాగే బిసి లకు చట్టసభల్లో ఉన్నత పదవులను కట్టబెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని రంగాల్లో బీసీలు ముందుండాలని ఆనాడు అన్న తారక రామారావు తర్వాతనారాచంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారని, ఈరోజు ఈ వైసీపీ పాలనలో బీసీలను అణగదొక్కే విధంగా బీసీల మీద తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వారిని మానసిక శోభకు గురి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికచ్చితంగారాబోయేటువంటి కాలంలో, తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానం చెప్పక తప్పదని తెలియజేశారు.
కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడుతున్న వ్యక్తినారాచంద్రబాబునాయుడు అని బడుగు బలహీన వర్గాల వారిని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు నుండి బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదని బ్యాక్ బోన్ కాస్ట్ అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇది రెండో సమావేశం విజయవాడ నగరం లోని విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ తమకు మద్దతు ఇవ్వటం చాలా ఆనందం కలిగించిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి ద్వారా విశ్వబ్రాములకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గొరిపర్తి శ్రీనివాస చక్రవర్తి ,దివి ఉమామహేశ్వరరావు, మాధవ, భాస్కర్, సుబ్రహ్మణ్యం, పొరపాక బాలు, కొండూరు మోహన్ తదితరులు పాల్గొన్నారుఢ.