మతాలు అన్ని నా హృదయమతాలు ఇఫ్తార్ విందు-అవినాష్

మతాలు అన్ని నా హృదయమతాలు ఇఫ్తార్ విందు-అవినాష్

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు  దేవినేని అవినాష్ 

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

అన్ని మతాలు నా మతం అని మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం 3వ డివిజన్,నూరిని మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విఫ్తార్‌ విందు భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్ష ముగించిన ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వడం గొప్ప పుణ్యకార్యమన్నారు.అనంతరం ముస్లీం సోదరులతో దేవినేని అవినాష్ కలిసి కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ యాసిన్,యూసఫ్ బైగ్,ఆరిఫ్,వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుస్సేన్ ముస్లిమ్ నాయకులురిజ్వాన్,అలీమ్,ఫజలుద్దీన్,చౌటు తదితరులు పాల్గొన్నారు.