వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్* .

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్*  .

*ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..*

* *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్* 

తలుపుల : రాష్ట్రంలోని పేదల కోసం పోరాడుతూ పెత్తందారులతో యుద్ధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నన్ను ఆదరించి, ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కోరారు. గురువారం మండల పరిధిలోని వేపమానిపేట పంచాయతీలో గంజివారి పల్లి, బోయపల్లి, కొత్తపూలవాండ్ల పల్లి, గుర్రంగుండ్ల వారి పల్లి గ్రామాలలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

*రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి.*

*నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.*

*రాష్ట్రాభివృద్ధి నిరోధకులతో నిరంతరం పోరాడుతున్న సంక్షేమ ప్రదాత జగనన్నకు మనమందరం అండగా నిలబడాలి.*

14 ఏళ్ల బాబు పాలనలో వ్యవస్థలను, మీడియాను మేనేజ్ చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదు.* 

*ఇంటి వద్దకే పథకాలు అందించే జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు జన్మభూమి కమిటీలకు తేడాను గమనించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి.*

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి, లీగల్ సెల్ జోనల్ ఇంచార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ గిరిధర్ రెడ్డి, ఎంపీపీ రఫీ నాయక్, కన్వీనర్ ఫయాజ్, సేవాదళ్ కార్యదర్శి డీకే బాబు, అవుల వివేకానంద రెడ్డి, ఎంపీటీసీ రఘురాములు, మండల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.