విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత
విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
అంగన్ వాడీల అరెస్టుకు ప్రయత్నం విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘటనా స్థలం వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎస్మా ప్రయోగించినా ఆందోళన విరమించని అంగన్ వాడీలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్ వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు పోలీసుల వాహనాలతో భారీగా బలగాలు చేరుకున్నాయి. ధర్నా చౌక్ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రోజు నోటీసులు ఇచ్చి, వెంటనే శిబిరాలను తొలగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వచ్చారని తెలుసుకుని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి .