కేశినేని శ్వేత టిడిపి కార్పొరేటర్ గా రాజీనామా

కేశినేని శ్వేత, టిడిపి 11వ డివిజిన్ కార్పొరేటర్
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
11వ డివిజన్ కార్పొరేటర్ గా నేను రాజీనామా చేశాను.
నా రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టిడిపి పార్టీకి రాజీనామా చేస్తాను.
మేము ఎప్పుడూ టిడిపి విడాలి అనుకోలేదు.
టిడిపి పార్టీ మమల్ని వొద్దు అనుకునప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు.కేశినేని నాని పార్టీకి రాజీనామా చేసాక కార్యకర్తలతో మాట్లాడి భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తారు.జగన్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేటర్ ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి పోటీ చేశారు.గౌరవం లేని చోట మేము పని చేయలేము.కేశినేని నాని కానీ నేను కానీ ప్రజల తరుపున పోరాటం చేస్తాము.గత సంవత్సరం కలం నుంచి టిడిపి పార్టీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.విజయవాడ చుట్టూ పక్కన వున్న ఒక్క పార్లమెంట్ లో కూడా అభ్యర్థి లేరు.
విజయవాడ పార్లమెంటు కి అభ్యర్థి ఉంటే ఇక్కడ ఎందుకు పార్టీ మార్చాల్సి వస్తుంది.
కృష్ణాజిల్లా లో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టిడిపి అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నాము.
మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడ లో ముగ్గురు నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.