లోయలో పడ్డ బస్సు ఆరుగురు మృతి, 22 మందికి గాయాలు
లోయలో పడ్డ బస్సు ఆరుగురు మృతి, 22 మందికి గాయాలు
జనచైతన్య న్యూస్- లడక్
లడఖ్ లో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. లేహ్ నుంచి తూర్పు లడఖ్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఆరుగురు ప్రయాణికులు మరణించగా, 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రి ఎస్‌ఎన్‌ఎం లేహ్‌కు తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ లేహ్ సంతోష్ సుకదేవ తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.