క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం
జనచైతన్య న్యూస్- నార్పల
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండల పరిధిలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడాస్పూర్తిని చాటాలని నార్పల నేతాజీ స్కూల్ కరస్పాండెంట్ ఎనమల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో శనివారం ఆర్డిటి ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ టోర్నమెంట్ గత రెండు రోజులుగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎనమల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాలికల క్రికెట్ టోర్నమెంట్ నందు ఆరు పాఠశాలల విద్యార్థినిలు పాల్గొన్నారని తెలిపారు.ఫైనల్ మ్యాచ్ లో గర్ల్స్ హై స్కూల్ నార్పల, వెంకటాపురం జడ్పీహెచ్ఎస్ పోటీ పడి విజేతగా వెంకటాపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్ రన్నర్ గా నార్పల గర్ల్స్ హైస్కూల్ నిలిచాయని చెప్పారు. గెలుపు ఓటములు సహజమని రెండిటిని ఒకటే స్ఫూర్తితో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఈటి శ్రీదేవి, ఆర్ డి టి క్రికెట్ కోచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.