పెద్దవడుగూరులో జై మాదిగ, జై జై మంద కృష్ణ మాదిగ నినాదాలతో హోరెత్తిన ప్రజలు
పెద్దవడుగూరులో జై మాదిగ, జై జై మంద కృష్ణ మాదిగ నినాదాలతో హోరెత్తిన ప్రజలు
జనచైతన్య న్యూస్- పెద్దవడుగూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు వారిగా చేసుకోవచ్చు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నందు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చరిత్రత్మకమైన తీర్పును ఇవ్వడం జరిగింది. ఎస్సీల్లో ఉండబడిన 59 కులాలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని..,30 సంవత్సరాల క్రితం ఎస్సీలకు సమాన హక్కులు వాటా పంపిణీ జరగాలని ఏర్పడిన (ఎమ్మార్పీఎస్) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుదీర్ఘంగా న్యాయపోరాటం చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 2024, 6,7,8 తేదీల్లో సుప్రీంకోర్టులో వాదనలు జరిగి, తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది, నేడు ఆ తీర్పుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై చంద్రచూడ్ ఎస్సీల్లో అసమానతలు తొలగడానికి రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయడం న్యాయబద్ధమైనదని తీర్పునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఆధ్వర్యంలో మాదిగ జాతి బిడ్డలందరి సమక్షంలో, ఎంతో భావోద్వేగంతో ఎస్సీ వర్గీకరణ తీర్పుని స్వాగతిస్తూ టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని,సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్య అతిథి అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం ఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ, తాడపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ యం పెద్దిరాజు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిష భూపతి మాదిగ, జిల్లా కార్యదర్శి కత్తుల కొండయ్య మాదిగ హాజరైనారు. పెద్దవడుగూరు ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు గూడూరు రంగస్వామి, వడగూరు ఆంజనేయులు అంజి ఆధ్వర్యంలో జరిగినది. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ మాట్లాడుతూ, మాదిగలు, ఇతర ఉపకులాల చిరకాల లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ కొరకు 30 సంవత్సరాల నుండి ఎన్నో అవమానాలు, అవాంతరాలు, వెన్నుపోట్లు ఎదుర్కొని, మాన్య మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటాలు చేయడం జరిగిందని, అయితే చివరకు నేడు వర్గీకరణకు ఆటంకాలు లేవని తీర్పు రావడం చాలా ఆనందాయకంగా ఉందని, మాన్య మంద కృష్ణ మాదిగ, చేసిన కృషిని యావత్ జాతి మొత్తం జీవితాంతం గుర్తుంచుకోవాలని, వర్గీకరణ వలన ఎస్సీల్లో వెనుకబడిన కులాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో భారత ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన కృషి మరువలేనిది అని తెలియజేశారు. వందలాదిగా కార్యకర్తలు చేరుకొని, బాణసంచా పేల్చుకుంటూ పెద్ద ర్యాలీ నిర్వహించేసి, అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ క్షీరాభిషేకం కు పూలమాల వేసి న్యాయం గెలిచిందని అన్నారు. బాణసంచాలు కాల్చి, స్వీట్లు తో ఒకరినొకరు ఎమ్మార్పీఎస్, సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కత్తుల కొండయ్య మాదిగ ఎమ్మార్పీఎస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిష భూపతి మాదిగ, జిల్లా కార్యదర్శి గూడూరు రంగస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అంజి మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు దిమ్మగుడి రామాంజనేయులు, నాగేష్ మాదిగ, రామచంద్ర మాదిగ, లింగన్న మాదిగ, లాలెప్ప మాదిగ, చిన్న హోలీ మాదిగ, వెంకట్ నారాయణ మాదిగ, ఎమ్మార్పీఎస్ పాల్గొనడం జరిగినది.