పెద్దమ్మ తల్లికి పుట్టింటి సారెను అందించిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు

పెద్దమ్మ తల్లికి పుట్టింటి సారెను అందించిన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు
జనచైతన్య న్యూస్- యాడికి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో వెలసిన పెద్దమ్మ తల్లికి పుట్టింటి సారెను శ్రీ శివలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు హరీష్ స్వామి అందజేశారు. ఆషాడమాసం నాల్గవ శుక్రవారం సందర్భంగా పెద్దమ్మ తల్లికి శ్రీ శివలక్ష్మిచెన్నకేశవ స్వామి ఆలయం తరఫునుండి ఆనవాయితీగా పూలు, పండ్లు, పిండి వంటలు, పలహారాలు, పట్టుచీర సారెగా అందజేశారు. ఈ పుట్టింటి సారెను శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుండి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా పెద్దమ్మ ఆలయం వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ అమ్మవారిని పసుపు కొమ్ములతో అందంగా అలంకరించి అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు హరి స్వామి, పెద్దమ్మ తల్లికి సహస్రనామార్చన, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టారు.