వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట అయన అవినీతి బురద కుంట*
**వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట అయన అవినీతి బురద కుంట*
**పుట్టపర్తిలో మళ్ళీ గెలిస్తే ప్రజలకు కన్నం వేయడం ఖాయం* *
*అవినీతి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నుంచి పుట్టపర్తి నియోజకవర్గాన్ని కాపాడుకుందాం*
*జనసంద్రంగా మారిన ఓడి చెరువు*
*ఎన్నికల రోడ్ షో లో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పత్తి చంద్రశేఖర్*
*ఓడి చెరువు :07*
వైసీపీ ఎమ్మెల్యే దుద్దే కుంట శ్రీధర్ రెడ్డి అయన బురద కుంట అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు.
ఈ ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దే కుంట శ్రీధర్ రెడ్డినీ ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి తోపాటు జన సేన పార్టీ ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ లతో కలిసి అయన ఎన్నికల రోడ్ షో నిర్వహించారు .ఓడి చెరువు పంచాయతీలోని ఓడి చెరువు ,అకుతోటపల్లి ,వేమారెడ్డి పల్లి ,బాబాస పల్లి ,మారేవాండ్ల పల్లి గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పత్తి చంద్రశేఖర్ కు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి అపూర్వ స్వాగతం పలికారు. ఓడి చెరువు జనసంద్రంగా మారింది .ఎన్నికల ప్రచార రోడ్ షో కు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దుష్ట పాలన సాగుతోందన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చమరగీతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం ఏలిందన్నారు. మళ్లీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గెలిస్తే ప్రజలకు కన్నం వేయడం ఖాయం అన్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ ప్యాన్ గుర్తుకు ఓటు వేస్తే ప్రజలకు కన్నీళ్లు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి తప్పిదాలు ప్రజలు మళ్ళీ చేయవద్దనీ ,మన ఓటు తో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు .వైసిపికి కాలం చెల్లిందని అన్నారు.
*శ్రీధర్ రెడ్డి నుంచి సేవ్ పుట్టపర్తి... సేవ్ పుట్టపర్తి*
అవినీతి ఎమ్మెల్యే డుద్దేకుంట శ్రీధర్ రెడ్డి నుంచి పుట్టపర్తి నియోజకవర్గాన్ని కాపాడుకుందామని టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే టిడిపి అభ్యర్థి పల్లె సింధూరమ్మ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. వైకాపా ఎమ్మెల్యే నుంచి పుట్టపర్తినీ కాపాడుకుందామని ,అందుకు ఒకటే తగిన సమయం మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అమూల్యమైన తమ ఓటును తెదేపా అభ్యర్థుల సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం సాగిందని పేర్కొన్నారు. ఇంత వరకు పుట్టపర్తి నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ కూడా ఇలాంటి అవినీతి ఎమ్మెల్యేనీ చూడలేదని అన్నారు. ఓటర్లు ఆలోచించి పుట్టపర్తి నియోజకవర్గం లో మంచి అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మీపై ఉందనీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి, ఎద్దుల ప్రమోద్ రెడ్డి ,జన సేన మండల కన్వీనర్ మేకల ఈశ్వర్, బీజీపీ కన్వీనర్ రంగారెడ్డి ,టిడిపి ,జనసేన, బిజెపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.