ఎన్నికలకు సిద్ధమా అంటూ దుద్దుకుంట శ్రీనివాసులు రెడ్డి ప్రచారం

ఎన్నికలకు సిద్ధమా అంటూ దుద్దుకుంట శ్రీనివాసుల రెడ్డి ప్రచారం :
సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మే (జనచైతన్య న్యూస్) మండల పరిధిలోని తిప్పేపల్లి పంచాయతీ లోని జెర్రికుంటపల్లి, తిప్పేపల్లి,తిప్పేపల్లి తాండ,ఉంట్లవారిపల్లి గ్రామాలలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసుల రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు,గడప గడప కి వెళ్లి జగనన్న కులామతాలకు అతీతంగా ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగనన్న, శ్రీధరన్న,అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నని ముఖ్యమంత్రి గా శ్రీధరన్నన్ని, ఎమ్మెల్యే గా గెలిపించండి అని కోరారు,ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి, సర్పంచ్ రామచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ సీ.కే సూర్యనారాయణ రెడ్డి కుర్లి రంగారెడ్డి, వైసీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు