యూనియన్ బ్యాంకు లోన్ బంగారం కిలాడి మేనేజర్ - సొంతం

కిలాడి బ్యాంక్ మేనేజర్
బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డానం చేయించుకున్న _ గంగూరు
విజయవాడ _ జన చైతన్య(తమ్మిన గంగాధర్)
యూనియన్ బ్యాంక్ మేనేజర్.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైద రాబాద్లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది.
తన వద్ద ఉన్న 380 గ్రాముల బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని ఆయనకు సూచించింది.
తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభర ణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిని పోలీసులను ఆశ్రయించాడు.