ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు మాదిగల ఆకాంక్ష అతి త్వరలోనే

ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు మాదిగల ఆకాంక్ష అతి త్వరలోనే

ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాలు మాదిగల ఆకాంక్ష అతి త్వరలోనే 

 జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు 

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజవర్గం పెద్దపప్పూరు మండలం  సోమనపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ నిర్మాణం కమిటీ వేయడం జరిగినది. అతి త్వరలోనే దండోరా జెండా ఎగిరేవేయాలని పిలుపునివ్వడం జరిగినది, టి ఆదినారాయణ మాదిగ అనంతపురం ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ , యం పెద్దిరాజు మాదిగ ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి  తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, కంబగిరి మాదిగ ఎమ్మార్పీఎస్ పెద్దపప్పూరు మండలం అధ్యక్షులు మాట్లాడుతూ మాన్య మందకృష్ణ మాదిగ 1994లో ప్రకాశం జిల్లా ఈ దుముడు గ్రామంలో 20 మంది యువకులతో ఎమ్మార్పీఎస్ దండోరా ఉద్యమం ప్రారంభించడం జరిగింది. మాదిగల అంటరాని కులం ఊరు బయటికి వెలివేసిన కులం ఎదురొచ్చే మైలయింది అని స్థానం చేసే రోజులు ఎన్నో అవమాన పడిన మాదిగ జాతి, ఎమ్మార్పీఎస్ వచ్చినాక మాదిగల కుటుంబంలో వెలుగు నింపిన మందకృష్ణ మాదిగ, మందకృష్ణ మాదిగ  దేవుడుగా రావడం మాదిగ జాతికి వెలుగు నింపడం జరిగింది, అలాంటి దేవుడు జాతిలో పుట్టడం మన అదృష్టం, అలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్య శ్రీ పోరాటం అయితేమీ వికలాంగుల పింఛన్ పోరాటం అయితే మీ దండోరా ఉద్యమం వల్ల ఎన్నో సాధించుకుందాం, ఎమ్మార్పీఎస్ నాయకులు వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ ధరించుకొని రావాలి. ఎమ్మార్పీఎస్ దండోరా ఉద్యమము మొదలుకొని 30 సంవత్సరాలు కావస్తున్న మాదిగల అభివృద్ధి కోసం విద్య రాజకీయం అన్నిరంగంలో మాదిగలు ఎదగాలని జాతి కోసం ఎంతోమంది మాదిగలు ప్రాణం త్యాగం చేయడం జరిగినది. 1998 ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ హైదరాబాదులో అమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగినది, ప్రభుత్వం నుండి స్పందన లేనందున ప్రాణహాని ఉందని తాడిపత్రిలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు యర్రగుంటపల్లి తెల్లబండ్ల రవి మాదిగ వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుటించుకుని ప్రాణా త్యాగం చేయడం జరిగినది, ఇలా చెప్పుకుంటూ పోతే జాతి కోసం ఎంతోమంది జాతి కోసం అమరవీరులు ప్రాణత్యాగం చేయడం జరిగినది.2000 నుండి 2004 వరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ జరిగినది, అప్పుడు మాదిగలకు వచ్చిన ఉద్యోగాలు 22,500 ల ఉద్యోగాలు వచ్చినాయి మాదిగలు విద్యారంగంలో రాజకీయ రంగంలో అభివృద్ధి అన్ని విధాలుగా మాదిగలు ఎదగడం జరిగినది. సాంకేత కారణ వల్ల ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగినది, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మాదిగ హామీ ఇవ్వడం జరిగినది. ఢిల్లీలో సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జీలు న్యాయమూర్తుల ద్వారా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ జరగబోతుంది, ఆ నమ్మకం విశ్వాసం ఉండాలని తెలియజేస్తున్నాం, తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామంలో  ఎమ్మార్పీఎస్ కమిటీ నిర్మాణం వేయడం జరిగినది, అదేవిధంగా ఈ గ్రామంలో దండోరా జెండా ఎగిరివేయాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ సీనియర్ నాయకులు,  చిన్న నరసింహులు మాదిగ ఎం ఎస్ ఎఫ్ మండల కన్వీనర్, ఎమ్మార్పీఎస్ సొమనపల్లి గ్రామకమిటీ వెంకటరమణ మాదిగ అధ్యక్షులు, వీరయ్య మాదిగ ఉపాధ్యక్షులు, నరసింహులు మాదిగఉపాధ్యక్షులు, రామాంజనేయులు మాదిగ ప్రధాన కార్యదర్శి, నాగేంద్ర మాదిగ ప్రధాన కార్యదర్శి, నవీన్ మాదిగ కార్యదర్శి, ఉపేంద్ర మాదిగ కార్యదర్శి, పవన్ మాదిగ కార్యదర్శి, నారాయణస్వామి మాదిగ కార్యదర్శి, నరసింహులు మాదిగ కార్యదర్శి, రామాంజనేయులు మాదిగ కార్యదర్శి, తిరుపాల్ మాదిగ కార్యదర్శి, గ్రామ పెద్దలు,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.