జగన్ పాలనలో ఎస్సీలకుఎడ్యుకేషన్లో అన్యాయం- రాజేష్

జగన్ పాలనలో ఎస్సీలకుఎడ్యుకేషన్లో అన్యాయం- రాజేష్

అంబేద్కర్ ఎపి దళితులకు విజ్ఞప్తి.దళిత రత్న-పరిశ పోగు రాజేష్.

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ సంక్షేమ పథకాలు తొలగించి మంచి చేస్తున్నామని మోసం చేస్తున్న ప్రభుత్వానికి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం రద్దు చేసిన27 పథకాలు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బ్యాంకు లోన్ రద్దు భూమి కొనుగోలు పథకం రద్దు అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకోవడం పథకాన్ని నిర్వీర్యం చేయడం ఏపీ స్టడీ సర్కిల్స్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు ఉద్యోగుల స్టడీ లీవ్ పూర్వస్థితిని మార్చి వేయడం ఎస్సీ ఎస్టీ ఎస్సైన్డ్ ల్యాండ్స్ లాక్కొని ఇండ్ల స్థలాల కేటాయింపు ఇళ్ల నిర్మాణంలో ఎస్సీలకు అదనపు సహాయంగా వచ్చే 50 వేల రూపాయలు నగదును నిలిపివేయడం బుక్ బ్యాంక్ స్కీం రద్దు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం స్కీము రద్దు జీవో నెంబర్ 12 14 ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్లు అమలకు నిరాకరణ స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదు ఎస్సీ ఎస్టీలకు కారుణ్య నియామకాలను భర్తీ చేయడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కనీసం ఒక కుర్చీ కూడా లేకుండా నిధులు మంజూరు చేయకపోవడం ఎంఏ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎం కం పథకం రద్దు ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్రబిందువుగా నిర్మించబడుతున్న అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం మెడికల్ సీట్ల భర్తీలో బి కేటగిరి సీ కేటగిరి సీట్లకు రిజర్వేషన్లను వర్తింప చేయకపోవడం ఎస్సీ జనాభా 50% ఉన్న గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం నిలిపివేయడం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం విషయంలో నిందితులు స్టేషన్ బెయిల్ పొందుతున్నారు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోట మినహాయించి మిగతా ఏ కోటాలో చేరిన ఉపకార వేతనాలు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఉచిత విద్యుత్ నిర్వీర్యం చేశారు ఎస్టీ పిల్లలకు విద్యను దూరం చేయడానికి సర్కిలర్ 172 జారీ చేయడం గురుకుల పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్ పథకం రద్దు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కుదింపు వీటన్నిటిని ప్రతి ఒక్క దళిత బిడ్డకు చేరే విధంగా కృషిచేసి రానున్న ఎన్నికలలో ఈ ప్రభుత్వాని మార్చటానికి  కృషి చేయవలసినదిగా కుల వివక్ష వ్యతిరేక ప్రచార చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దళిత రత్న పరిశపోగు రాజేష్   వివరించారు.