ఇసుకపై ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్
ఇసుకపై ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్
జనచైతన్య న్యూస్-తాడిపత్రి
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అక్రమ ఇసుక రవాణా పై ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి సర్జికల్ స్ట్రైక్ ప్రకటించారు, ఏకకాలంలో తాడిపత్రి పరిసరాలల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా పై చర్యలకు ఉపక్రమించారు. ఇసుక డంప్ లు ఎక్కడ ఉన్నాయో స్వయంగా ఆరా తీసి అక్కడికి ముందుగా కార్యకర్తలు వెళ్ళి పోలీసులు స్వాధీనం పరచుకొనే వరకు అక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. సంభందిత అధికారులకు ఎక్కడ కూడా అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా జరగకూడదు, అంటూ అల్టిమేటం జారీ చేశారు.నేడు ఉదయం మునిసిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కూడా సొంతవారైనా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదంటూ తేల్చి చెప్పడం జరిగింది. దీనితో ఇసుకాసురుల నోట ఇసుక పోసినట్టు అయ్యిందని, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.