ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతులు మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతులు మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతులు మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు

 జన చైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ బోధను అందించి ఉన్నత శిఖరాలకు చేరే విధంగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థిని విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.