ఘనంగా కామ్రేడ్ వెంగమ నాయుడు వర్ధంతి
ఘనంగా కామ్రేడ్ వెంగమ నాయుడు వర్ధంతి
జనచైతన్య న్యూస్- యాడికి
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో కామ్రేడ్ వెంగమనాయుడు 27వ వర్ధంతిని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ, అధ్యక్షతన సిపిఐ పార్టీ నాయకులతో కలసి శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్, సిపిఐ సీనియర్ నాయకులు నీలూరి లక్ష్మయ్య, కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు 1972 లో అనంతపురం జిల్లా కార్యదర్శిగా ఎంపికై 1992 వరకు సుమారు 20 సంవత్సరాలు జిల్లా పార్టీ కార్యదర్శిగా పని చేశారు. పెత్తందారీ భూస్వాముల నుండి అనేక పోరాటాలు చేసి నిరుపేదలకు భూ పంపిణీ, నిరుపేద బడుగు బలహీన వర్గాలు కార్మికులు, రైతు కూలీలు, కర్షకుల కోసం నారాయణస్వామి కాలనీ తోపాటు జిల్లాలోని నిరుపేదలందరికీ ఇంటి స్థలాల కోసం అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు. అదేవిధంగా యాడికి కాలువ పిన్నేపల్లి చెరువు నీటి కోసం ప్రజలను రైతుల తో కలిసి పోరాడారని ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు శ్రీరాములు, ఓబిరెడ్డి, సూర్యనారాయణ, గరిడి శివన్న సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు, సిపిఐ నాయకు లు బండారు రాఘవ, చౌడయ్య, బాలన్న, ఆదినారాయణ, పోలా రంగస్వామి, రామాంజనేయులు, కుల్లాయి రెడ్డి, రాజు, ముత్యాలు, రంగనాయకులు, పెద్దిరాజు, సూరి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.