జన చైతన్య బ్రేకింగ్ న్యూస్
JanaChaitanya News breking News
Blast in Factory:ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..
Blast in Factory : ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది
ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలిందిదాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు
ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారుహుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారుపలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు