ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్
Obuladevaracheruvu manadala JanaChaitanya News
చిత్తూరు జిల్లా -కాణిపాకం
25.5.2024
*వరసిద్ధి వినాయకుని కృపాకటాక్షాలతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్న - వై.వి.బి.రాజేంద్రప్రసాద్
*ఈరోజు చిత్తూరు జిల్లా కాణిపాకం లో స్వయంభు వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న రాజేంద్రప్రసాద్ గారు*
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ
_శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రజలందరిపై ఉండాలనిఐదు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలకు జూన్ 4వ తేదీతో మంచి రోజులు రాబోతున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అలా జరిగితేనే మన రాష్ట్రానికి మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వినాయక స్వామిని కోరుకున్నట్లు రాజేంద్రప్రసాద్ అన్నారు
ఆలయ అధికారులు రాజేంద్రప్రసాద్ గారికి సాదరంగా స్వాగతం పలికి వేద పండితుల చేత ఆశీర్వాదాలు ఇప్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చుక్కా ధనుంజయ యాదవ్కిరణ్రవిప్రకాష్ నాయుడుకుప్పాల మురళి తదితరులు పాల్గొన్నారు