కత్తులు, వేటకొడవల్ల తో మొహర్రం వేడుకలు
కత్తులు, వేటకొడవల్ల తో మొహర్రం వేడుకలు
జనచైతన్య న్యూస్- ఉరవకొండ
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ మండలం లో రాకేట్ల గ్రామం లో మొహర్రం వేడుకలు గ్రామ ప్రజలు జరుపుకున్నారు.అయితే గ్రామంలో చిన్నసరిగెత్తు కావడంతో స్వామి వారిని ఊరేగింపుతో తెల్లవారు జామున గ్రామ ప్రజలు స్వాములను ఊరేగింపోలో భాగంగా స్వామి కి ఎన్నడూ లేని ఆచారంలో భాగంగా స్వాముల ముందు గ్రామ ప్రజలు అతి భక్తి తో కత్తులు, వేట కొడవళ్లు పట్టుకొని గుంపులు గుంపులుగా తప్పేట్లు మేళాలతో స్వాములను ఊరేగించారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా చూడని ఆచారం ఉరవకొండ మండలం రాకేట్ల గ్రామంలో చేసారు. ఇందులో ఎవరు ఎప్పుడు ఆవేశానికి గురి అవుతారో ఏమో ఎవ్వరికి ఏమి జరుగుతుందో అని గ్రామ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.