సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా మల్లాదికి కావాలి

సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా మల్లాదికి కావాలి

సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మా మల్లాది విష్ణు కావాలి

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు& రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి,పార్టీ అధిష్టాన వర్గం పెద్దలకు విన్నపం! రాజకీయాలను వ్యాపారంగా కాకుండా సేవాభావంతో నిత్యం ప్రజల మధ్య వుండే "సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ని తప్పించి"ప్రతక్ష రాజకీయాల నుండి దూరం చేయడం అత్యంత బాధాకరం! నిత్యం అన్ని సామాజిక వర్గం ప్రజలకు అందుబాటులో వుండే విష్ణు ని రాజకీయాలకు దూరం చేయకండి . మీకు అత్యంత విధేయుడుగా ఉండి మీరు ఇచ్చే ప్రతి ప్రభుత్వ పార్టీ ప్రోగ్రామ్స్ ఎంతో విజయవంతంగా సమర్థ వంతంగా నిర్వహించి,పార్టీకి రాయల్ గా వుంటూ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో వుండే మంచి కమిట్ మెంట్ గల నాయకుడుని కాదనుకుంటే సెంట్రల్ లో వైసీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది!దయ చేసి అలోచించండి!విజ్ఞతతో నిర్ణయం తీసుకోని సెంట్రల్ లో నియమించిన ఇంచార్జ్ ను వెనక్కి తీసుకోండి . "మీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకంచడం" లేదు . మా మనోవేదనను పార్టీ కార్యకర్తలు మనోభావాలు దయ చేసి అర్ధం చేసుకొని"సిట్టింగ్ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు  అన్యాయం చేయకుండా సెంట్రల్ అసెంబ్లీ టికెట్ "ఇవ్వండి . మీ,అర్ ఎస్ నాయుడు మరియు సెంట్రల్ వైసీపీ కుటుంబ సభ్యులు .