అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం ఏ ఐ ఎస్ సి ఎస్ టి డబ్ల్యూ ఏ తరపున కలిసి గుమ్మనూరు జయరాం కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయ సన్మానం చేశారు

అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం ఏ ఐ ఎస్ సి ఎస్ టి డబ్ల్యూ ఏ తరపున కలిసి గుమ్మనూరు జయరాం కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయ సన్మానం చేశారు
జనచైతన్య న్యూస్-గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యునిగా ఎంపికైన గుమ్మనూరు జయరాం ని అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం ఏ ఐ ఎస్ సి ఎస్ టి డబ్ల్యూ ఏ తరఫున కలసి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ సన్మానం చేసి ఫీల్డ్ ఇచ్చి నియోజకవర్గంలోని పలు సమస్యల పైన చర్చించి ముఖ్యంగా నియోజకవర్గంలోని కిట్కో హౌసెస్ పూర్తి కాకుండా అసంపూర్ణంగా ఉన్నాయి వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చి, నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల సమస్యలను తీర్చాలని శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం కి తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం ఏ ఐ ఎస్ సి ఎస్ టి డబ్ల్యూ ఏ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ మనవల ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుండ్లపల్లి శాంతి రాణి, సేట్నేపల్లి వెంకటేష్, అరటి కొండ రంగనాయకులు, శ్రీకాంత్, అర్జున్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.