కదిరి ఆర్టీవో గా జె శ్రీనివాసులు జాయిన్ అయ్యారు
కదిరి ఆర్టీవో గా జె శ్రీనివాసులు జాయిన్ అయ్యారు
జనచైతన్య న్యూస్-కదిరి
సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో కదిరి ఆర్టీవో గా జె శ్రీనివాసులు జాయిన్ అయ్యారు, వారు అనంతపురం డీటీసీ ఆఫీస్ లో పరిపాలన అధికారిగా ఉంటూ ఆర్టీవో గా ప్రమోషన్ పొంది కదిరి కి మొట్ట మొదటి ఆర్టీవో గా రిపోర్ట్ చేశారు. శ్రీనివాసులు రవాణ శాఖలో మే నెల 1993లో జూనియర్ అసిస్టెంట్ గా చేరారు. తదుపరి మే 2003లో సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందారు. రాయలసీమలో అన్ని చోట్ల పని చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆర్టీవో గా పదోన్నతి పొందారు. వారు ఉమ్మడి చిత్తూర్ జిల్లా లో ఉన్న గుడిమల్లం గ్రామ వాస్తవ్యులు ఏర్పేడు మండలం, ఇప్పుడు కదిరి ఆర్టీవో ఆఫీస్ లో సిబ్బంది ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు, ఒక పరిపాలన అధికారి, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటారు.