ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి :
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి :
సత్యసాయి జిల్లా అమడగూరు మే 02:జనచైతన్య న్యూస్ :మండలంలోని మహమ్మాదాబాద్, పట్రవండ్లపల్లి, కొత్తూరు, సోలుకుంట్ల, చెర్లోపల్లి, కస్సముద్రం, గ్రామాలలో పుట్టపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఎన్నికల ముందు ఇస్టానుసారంగా హామీలు ఇవ్వడం అధికారంలోకి రాగానే వాటిని గంగలో కలపడం టీడీపీ, వైసీపీ పార్టీలకు అలవాటుగా మారింది అన్నారు, ఈసారి ఎన్నికల్లో వాళ్ళ మాయమాటలు నమ్మకుండా, అభివృద్ధి చేసే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో నాయకులు గౌస్ బాషా, వాసుదేవరెడ్డి , శ్రీనివాసులు, సురేంద్ర రెడ్డి,సంతోష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మోహన్, రామాంజులు, గంగాధర్, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు