జగన్నాటకానికి టైం అయిపొయింది పల్లె సిందూరరెడ్డి :
జగన్నాటకానికి టైం అయిపొయింది పల్లె సిందూరరెడ్డి :
సత్యసాయి జిల్లా అమడగూరు ఏప్రిల్25:జనచైతన్యన్యూస్ మండలంలోని పూలకుంటపల్లి పంచాయితీలోని గోపాల్ నాయక్ తాండ, ఏటిగట్టు తాండ, బోడిగుండ్లపల్లి, కుమ్మరిండ్లు, లొకోజుపల్లి, దుదరగుట్టపల్లి గ్రామాల్లో పుట్టపర్తి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి పల్లె సిందూరరెడ్డి ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. పల్లె సిందూరరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల ప్రచారం లో వైసీపీ పార్టీ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపారు అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలని ప్రోత్సాహించారు ఇపుడు ఎన్నికల సమయం కాబట్టి మళ్ళీ జగన్నాటకాన్ని మొదలుపెట్టారు వైసీపీ నాటకాలు ఇక సాగనివ్వం. ఈసారి పుట్టపర్తి గడ్డపై టీడీపీ జెండా ఎగరడం ఖాయం అపుడు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం అన్నారు.సల్లాపురమ్మ గుడిలో పూజలు నిర్వహించారు,ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు,పల్లె సిందూరరెడ్డి సమక్షంలో టీడీపీ లోకి 15 కుటుంబాలు చేరాయి,కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి,మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మెన్ కృష్ణమూర్తి, నంజప్ప, బో్డెప్ప, జనసేన నాయకులు నరేష్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు