జగనన్న సంక్షేమ పాలన పట్ల మైనార్టీల హర్షం
జగనన్న సంక్షేమ పాలన పట్ల మైనారిటీల హర్షం
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
షేక్ గౌస్ మొహిద్దిన్
జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మెన్
ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పాలన పట్ల మైనారిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ షేక్ గౌస్ మొహిద్దిన్ అన్నారు.ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం,64వ డివిజన్ కండ్రిక లోని "మస్జిదే హబీబ్" మసీదు పెద్దల ఆహ్వానం మేరకు ఇక్కడకు విచ్చేసిన జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ గౌస్ మొహిద్దిన్ స్థానిక ముస్లిం సోదరులతో కలిసి మసీదులో శుక్రవారం నమాజునుఆచరించారు.అనంతరం స్థానిక ముస్లిం పెద్దలు గౌస్ మొహిద్దిన్ నుశాలువాలతోసత్కరించారు.ఈ సంధర్భంగా స్థానిక సమస్యలపై,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై గౌస్ మొహిద్దిన్ వారితో మాట్లాడారు.ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల వల్ల మైనారిటీలు పొందుతున్న లబ్దిని ఈసంధర్భంగా గౌస్ మొహిద్దిన్ వారికి వివరించారు.ఎన్నడూ జరగని విధంగా మైనారిటీలకు మేలుచేస్తున్న జగనన్న కు అండగా నిలబడి ఆశీర్వదించాలని కోరారు.ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ రాములు తిరుపతమ్మ,డివిజన్ కోఆర్డినేటర్ షేక్ ఇస్మాయిల్ పాటు,ముస్లిం పెద్దలు షేక్ సుభాని,షేక్ బాజి,షేక్ సత్తార్,ఎండి ఫైజుల్ల తదితరులు పాల్గొన్నారు.