ఆలయాలు నాగరికతకు ప్రతీకలు జగన్ హయాంలో ఆలయాలకు మహర్దశ

ఆలయాలు నాగరికతకు ప్రతీకలు జగన్ హయాంలో ఆలయాలకు మహర్దశ

ఆలయాలు నాగరికతకు ప్రతీకలు జగన్ హయాంలో ఆలయాలకు మహర్దశ

జనచైతన్య న్యూస్-సంబెపల్లి 

సంబేపల్లె మండలం నారాయణ రెడ్డి గారి పల్లె గ్రామం పొన్నెల్లవాండ్లపల్లెలో నూతనంగా నిర్మించిన గుర్రప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,ఆలయాలు నాగరికతకు ప్రతీకలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.సంబేపల్లె మండలం నారాయణరెడ్డి గారిపల్లె గ్రామం పొన్నెల్లవాండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన గుర్రప్ప స్వామి ఆలయంలో సోమవారం మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి,రాయచోటి జెడ్ పి టి సి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ డిసిసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామిరెడ్డి,బిసి నాయకులు నాగరాజు యాదవ్,రఘు,శివ శంకర్ యాదవ్ తదితర నాయకులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజలకు విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి కి స్థానిక ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికి,ఆయన చేత ప్రత్యేక పూజలు నిర్వహింప చేసి,తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువతో సత్కరించారు,ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూతన ఆలయాల నిర్మాణాలుకు గత జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.అపర శ్రీకృష్ణ దేవరాయలుగా సీఎం జగన్ పేరొందారన్నారు,రాయచోటి నియోజక వర్గ వ్యాప్తంగా తిరుమల శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 76 ఆలయాలు మంజూరు చేయించడం జరిగిందని,త్వరలోనే ఆ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయన్నారు,రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ పశ్చిమ రాజగోపురం,మాడ వీధుల నిర్మాణాలు, సంబేపల్లె మండలంలోని శ్రీ దేవర రాయి నల్లగంగమ్మ తల్లి ఆలయం (నిర్మాణపు పనులు దాదాపుగా పూర్తి),శ్రీ గుహేశ్వరి పసుపతినాధ ఆలయం,శ్రీ దేవపట్లమ్మ తల్లి ఆలయం,శెట్టిపల్లె గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,చిన్నమండెం మండలంలోని మండెం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,మల్లూరమ్మ ఆలయ నిర్మాణాలకు పెద్ద ఎత్తున సి జి ఎఫ్ నిధుల మంజూరుకు కృషి చేయడం జరిగిందన్నారు.ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడు చుండడం సంతోషంగా ఉందన్నారు.దేవుడి దయతో వర్షాలు సంవృద్దిగా కురిసి ప్రజలు,రైతులు సుభిక్షంగా,సంతోషంగా ఉండాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.శ్రీకాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన పొన్నెళ్ల వాండ్లపల్లె వాసులు నారాయణరెడ్డి గారిపల్లె గ్రామంలోని పొన్నెళ్లవాండ్లపల్లె లో గుర్రప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రూ 10 లక్షల నిధులను మంజూరు చేయించడం మండల కేంద్రమైన సంబేపల్లె నుంచి పొన్నెళ్లవాండ్లపల్లె తారు రోడ్డు సౌకర్యం కల్పనలో మీ కృషి అభినందనీయమంటూ మాజీఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు,అభినందనలు తెలిపి దుస్సాలువలుతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వివి ప్రతాప్ రెడ్డి,సర్పంచ్ అంచల రామచంద్ర,వాసుదేవ రెడ్డి, శ్రీనివాసులు,మెడికల్ స్టోర్ అన్నారెడ్డి,మోటకట్ల జె సి బి ప్రతాప్ రెడ్డి, రాజా,గుర్రయ్య యాదవ్,కోటేశ్వర నాయుడు,స్థానికులు ఉప సర్పంచ్ సుదర్శన్ రెడ్డి,సహదేవ రెడ్డి,గిరిధర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,నెరేళ్లవంక జయచంద్రా రెడ్డి,వెంకట్రామి రెడ్డి,రవీంద్రా రెడ్డి,చంద్రశేఖర్,నెరేళ్లవంక రామ్మోహన్ రెడ్డి,సురేంద్ర, చిన్నపురెడ్డి,సుబ్బారెడ్డి, నాగయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.