ఆంధ్రజ్యోతి సర్దార్ మరుపిళ్ళ చిట్టి అందరివాడు

ఆంధ్రజ్యోతి సర్దార్ మరుపిళ్ళ చిట్టి అందరివాడు

ఆంధ్రజ్యోతి సర్దార్ మరుపిళ్ళ చిట్టివిగ్రహంఆవిష్కరణఅందరివాడు-పోతిన మహేష్

విజయవాడ-జనచైతన్య (తమ్మిన గంగాధర్)

కోమల సెంటర్ వద్ద ర్యాలీని మరుపిళ్ళ చిట్టి  మనవడు మరుపిళ్ళా శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని జండా ఊపి ప్రారంభించారు.

మరుపిళ్ళ చిట్టి కాంస్య విగ్రహ ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కమిటీలోని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు మరియు శుభాకాంక్షలు.  భూ కబ్జాదారులు ట్రస్టుల పేరుతో ప్రభుత్వాసులను కాజేసిన వారు దుర్గా బ్యాంకు ను నగరాలకు దూరం చేయడంతో పాటు భోగవల్లి సత్రం ట్రస్టు భూములు కొట్టేసిన వాళ్ళు చిట్టి  కాంగ్రెస్ ఆఫీసును కొట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలనుకున్న వెల్లంపల్లి శ్రీనివాసులు లాంటి వాళ్ళతో చిట్టి లాంటి భూధానాలు చేసిన వ్యక్తి, నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అందరివాడు ఆంధ్రజ్యోతి సర్దార్ శ్రీ మరుపిళ్ళ చిట్టి  విగ్రహ ఆవిష్కరణ జరగడం చాలా బాధాకరం. పోతిన వెంకట మహేష్ . చిట్టి  స్వాతంత్ర సమరయోధులు ,దేశభక్తికి నిలువెత్తు నిదార్చనం, మద్యంకు వ్యతిరేకంగా పోరాడిన వారు, ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నవారు, ప్రజలకు కష్టమంటే చిట్టి  అక్కడే ఉండేవారు, 16 కార్మిక సంఘాలను సంఘటిత పరిచి ఒక్క తాటిపై నడిపిన గొప్ప వ్యక్తి, కొండ ప్రాంత వాసులకు వేలాదిమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించిన వారి సొంత ఇంటి కలను సాకారం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 25 ఎకరాల భూమిని దానం చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్.  2019లో పవన్ కళ్యాణ్  నగరాల సామాజిక వర్గానికి అసెంబ్లీ సీట్లు కేటాయించిన తరువాతే నగరాలు రాజకీయంగా ఎదిగారు. 2019 కి ముందు నగరాలకు రాజకీయ ఎదుగుదల లేక 35 సంవత్సరాలయింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నగరాల సామాజిక వర్గం రుణపడి ఉండాలి. రెండు నామినేటెడ్ పదవులు ఇచ్చి ఏదో సామాజిక వర్గాన్ని ఉద్ధరించినట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడ్డం చాలా దుర్మార్గం.

నగరాల సామాజిక వర్గానికి చెందిన రాళ్లపూడి సుజాత గపై  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించింది వైఎస్ఆర్సిపి నాయకులు ఈ విషయాన్ని ఎవరు మర్చిపోలేదు.

చిట్టి  నిర్మించిన వాటర్ ట్యాంక్ నేటికీ చిట్టినగర్ వాసుల మంచినీటి అవసరాలను తీరుస్తుంది కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ నిర్మించిన వాటర్ ట్యాంక్ నేటికీ చుక్క నీళ్లకి ఉపయోగపడటం లేదు. నీతికి అవినీతికి మధ్య తేడా ఇదే.  సారా, మద్యంకు వ్యతిరేకంగా చిట్టి  పోరాడారు కానీ పేకాట, బ్రాకెట్ ఆట, కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం పేరుతో మహిళలను లోబర్చుకున్న వ్యక్తులు ఈ రోజున చిట్టి  విగ్రహావిష్కరణలో పాల్గొనడం నిజంగా దురదృష్టకరం. చిట్టి  ఆత్మ కూడా శోధిస్తుంది.

చిట్టినగర్ సెంటర్లో చిట్టి  విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వడ్డాది కృష్ణ అనేకసార్లు ప్రయత్నం చేశారు వారిని ఈ సందర్భంలో స్మరించుకోవడం తప్పనిసరి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో కూడా గతంలోనే చిట్టి విగ్రహ ఏర్పాటుకు కౌన్సిల్లో ఆమోదం పొంది ఉన్నది.