యూత్ ఆధ్వర్యంలో చలివేద్రం ఏర్పాటు.

యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.(పుట్లూరు జనచైతన్య న్యూస్) అనంతపురం జిల్లా సింగమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలో స్థానిక యూత్ పుట్లూరు మండలంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సమీపంలో మంచి నీటి చలివేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు.అనంతరం పుట్లూరు యూత్ మండల అధ్యక్షుడు వి.రవి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు పుట్లూరు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామ మన్నారు.అదేవిధంగా స్థానికంగా మండలంలో వివిధ పనుల కోసం గ్రామాల నుంచి చాలామంది ప్రజలు మండలానికి వస్తుంటారు. అంతేకాకుండా వేసవిలో చలివేంద్రాన్ని ఉచితంగా తాగునీరు అందజేయడం ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వి.రవి, రాజు, యోగేంద్ర, రాజేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.