శ్రమజీవిగా పోరాటం తప్ప-కల్లా కపటం తెలియని వ్యక్తి-పోతిన మహేష్

శ్రమజీవిగా పోరాటం తప్ప-కల్లా కపటం తెలియని వ్యక్తి-పోతిన మహేష్

పోరాటం తప్ప నటించడం తెలియని పోతీన మహేష్ సొంత పార్టీ చేసిన అన్యాయంపై ఆవేదన గుండె తరుక్కుపోతుంది

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

జాతీయ బిసి సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్

విజయవాడలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని తదనంతరం సిలువ మోసి యేసు ప్రభువుకు బాధలు చెప్పుకుంటున్న అంటూ కార్యకర్తల సమావేశంలో భావోద్వేగంతో మాట్లాడిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి విజయవాడ జనసేన అధ్యక్షుడు పోతిన మహేష్ ఆవేదన ఈ రెండు  తెలుగు రాష్ట్రాల్లో  ప్రజల హృదయాన్ని ఎంతో బాధకు గురి చేసిందని జనసేన నేత జన హృదయ నేత శ్రీ పవన్ కళ్యాణ్  ఈ వీడియో చూసి ఒక్కసారి నిజమైన బాధ ఎలా ఉంటుందో మనసుని కదిలించి వేస్తుందని వెంటనే తన నిర్ణయం మార్చుకుంటారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ ఒక ప్రకటనలో పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు ఈరోజు  తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లోనూ పనిచేసే ముఖ్య నాయకులు ప్రజలు మహేష్ వ్యక్తపరిచిన భావోద్వేగం మనోవేదనకు గురి చేసిందని ఇటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీలు అధినాయకులు ప్రజల మనోభావాల్ని చూసి మార్పు చెంది మహేష్ కి పశ్చిమ నియోజకవర్గం సీటు ఇప్పించి తను ఐదు సంవత్సరాలుగా అధికారపక్షంపై సాగించిన పోరాటం విలువని ప్రజల్లో చాటి చెప్పాలని జననేత జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ కి బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో అనేకమంది మహేష్ కి సీటు రాకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారని రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు కూడా మహేష్ కి సీటు వస్తే బాగుంటుంది అని తమ భావాన్ని ప్రత్యక్షంగా వ్యక్త పరుస్తున్నడం పార్టీ అధినాయకత్వం గమనించవలసిన అవసరం ఉన్నదని మీ కూటమికి ఈ సీటు తప్పనిసరిగా గెలిచే అవకాశాన్ని మీ చేతులారా మీరు చేజార్చుకోవద్దని కూటమినేతలకు వేణుమాధవ్ హితోవుపలికారు.