ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ

జనచైతన్య న్యూస్-ఎన్టీఆర్ 

ఎన్టీఆర్ జిల్లా దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో అట్రాసిటీ చట్టము అమల స్థితిపై సిటిజన్స్ ఆడిట్ వార్షిక రిపోర్ట్ ను ఎస్సి కమీషన్ చైర్మన్ ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారంపూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం చాలా శక్తివంతమైనదని తద్వారా అంటరానితనం అత్యాచారాలు నిర్మూలించేందుకు,ఆత్మగౌరవం కాపాడేందుకు కీలకమైన చట్టము అని అన్నారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా సమర్థవంతంగా అమలు చేయాల్సింది,ప్రభుత్వ యంత్రాంగమే అని తెలిపారు,అనేక పోరాటాల ఫలితంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం1989లో రాగా నియమ నిబంధనలు 1995లో రూపొందించినా నేటికీ కూడా అములు లో అనేక అవరోధాలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు,ఈ చట్టంలో నియమ నిబంధనల ప్రకారము మండల జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అన్ని యంత్రాంగాలు పోలీస్,రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ వంటి శాఖలన్నీ అట్రాసిటీ చట్ట స్ఫూర్తిని కాపాడి సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు,ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం రూల్ 18 ప్రకారము ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సిన అవసరం ఉన్నది,అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చిన నివేదిక,నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో అందించిన వివరాలు,సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి రాష్ట్ర సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో 2022వ సంవత్సర నివేదికను తయారు చేయడం జరిగింది.ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు గత 2021 వ సంవత్సరం కంటే 2022 లో 6.4% పెరుగాయి,2022వ సంవత్సరంలో ఎస్సీ,ఎస్టీల మీద జరిగిన దాడులు 2893 కాగా ఇందులో హత్యలు 59,మానభంగాలు 198, దాడులు 572, గృహ,పంటల దహనాలు 15 జరిగాయి,అనగా రాష్ర్టసగటున రోజుకి 8 అత్యాచారాలు,సగటున వారానికి 3-4 మానభంగాలు సగటున నెలకు రెండు హత్యలు జరుగుతున్నట్లు నివేదిక తేటతెల్లం చేస్తుంది,అట్రాసిటీ చట్టంలో 60 రోజుల్లో చార్జిషీట్ వేయాల్సి ఉండగా 1173 కేసుల్లో మాత్రమే 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేశారు,627 కేసుల్లో 60 రోజుల తర్వాత వేశారు,బాధితులకు ఏడు రోజుల్లో రిలీఫ్ అందించాల్సి ఉండగా రాష్ట్రములో 304 కేసుల్లో మాత్రమే ఇచ్చారు,అట్రాసిటీ బాధితులకు సెక్షన్ 21 ప్రకారము న్యాయ సహాయము అందించాల్సి ఉండగా ఒక్క కేసులో కూడా ఇవ్వలేదు,2022 వ సంవత్సరంలో 1147 కేసుల్లో 44 కేసుల్లో మాత్రమే శిక్షలు పడగా,ఇంకా 8544 కేసులు కోర్టుల్లో పెండింగ్ లో వున్నాయి,రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల భద్రతకు అత్యాచారాల నిరోధక చట్టం స్ఫూర్తిని కాపాడేందుకు మోడల్ కంటెజన్సీ ప్లాన్ వుందే తప్ప గజెట్ ఇప్పటికీ లేదు,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా బాధితులకు ఇచ్చే రిలీఫ్ పథకంకోసం జిల్లా కలెక్టర్ నేరుగా అంబేద్కర్ ఫౌండేషన్ నిధుల కోసం దరఖాస్తు చేయాలి.కానీ రాష్ట్రంలో ఎక్కడా దరఖాస్తులు చేయలేదు, పెరుగుతున్న దాడులకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసుల్లో స్పెషల్ కోర్టుల సంఖ్య పెంచాలి,స్పెషల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ బాధితుల కోరిక మేరకు సీనియర్ న్యాయవాదులును నియమించుకొనే హక్కు కు అవకాశం కల్పించాలి,బాధితులకు విచారణ,ఇన్వెస్టిగేషన్,కోర్టు వాయిదాల సమయంలో ప్రయాణపు ఖర్చులు,భత్యాలు చెల్లించాలి,అత్యాచారాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం,ఆ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వము చేపట్టాలి, స్పెషల్ కోర్టులో కొట్టి వేసిన కేసులలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము పై కోర్టుకు ఆపిల్ కు వెళ్లేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి,ముఖ్యమంత్రి అధ్యక్షతన సంవత్సరానికి రెండుసార్లు విధిగా నిర్వహించాలి,అన్ని జిల్లా రెవెన్యూ డివిజన్ స్థాయిలలో జిల్లా పర్యవేక్షక నిఘా కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం జరిగేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హై కోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు,దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ డా రమణమూర్తి,సంగుల పేరయ్య ,ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ టీ అశోక్ కుమార్,కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చారవాక్, వివిధ జిల్లాల సిటిజన్ విజిలెన్స్ కమిటీ సభ్యులు మెత్తర అజయ్ బాబు,శేషారత్నం,పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.