శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,పరిశీలన కార్యాచరణ
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,పరిశీలన కార్యాచరణ
జనచైతన్య న్యూస్-ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,కమీషనర్ ఎస్ సత్యనారాయణ,ఐఏఎస్ ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు,ఆలయ ఈఈ లు,ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి దేవస్థానం నందు జరుగుచున్న ఆలయ అభివృద్ధి పనులను భాగముగా అన్నదానము,ప్రసాదం పోటు,తదితర పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి కొన్ని సూచనలు దేవస్థానం వారికి అందజేశారు.ఈ సందర్బంగా సదరు పనుల వివరములను ఆలయ ఈవో,ఈఈ, ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి వివరించారు.ఆలయం నందు జరుగుచున్న అన్నదానంను పరిశీలించి,అధికారులకు సూచనలిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తో పాటుగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు,లింగం రమ,డిఈఈ లు,ఏఈఈ లు,ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.