రాజ్యంలో అణచివేతకు వ్యతిరేక ప్రచార ఉద్యమం
రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం -(సిఎఎస్‌ఆర్)
విజయవాడ- జనచైతన్య (తమ్మినగంగాధర్)
రాజ్యం జర్నలిస్టుల నిరంతర నిర్బంధం; పత్రికా స్వేచ్ఛను అణచివేయడాన్ని ఖండిస్తున్నాం.2024 మే 3న, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నాడు, భారతదేశంలో క్షీణిస్తున్న పత్రికా స్వేచ్ఛ, ప్రత్యేకించి 2014లో బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్- మోదీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తీవ్ర క్షీణతపట్ల ఆందోళన చెందుతున్నాం. ఇటలీ, బ్రెజిల్‌లలో బెనిటో ముస్సోలినీ, సిల్వియో బెర్లుస్కోనీ, జైర్ బోల్సోనారోలు అమలు చేసిన పత్రికా నియంత్రణ ప్రక్రియకు సమానమైన మీడియా కథనాలని సంపూర్ణంగా నియంత్రించడానికి, బిజెపి ఫాసిస్ట్ ఎజెండాకు ప్రచార విభాగంగా మార్చడానికి రాజ్యం ప్రయత్నిస్తోంది.
కశ్మీర్, నాగాలాండ్, అస్సాం, మణిపూర్ వంటి అణచివేతకు గురవుతున్న ప్రజల జాతీయ పోరాటాలకుమద్దతునిస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నారని, ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలకు అనుబంధంగా వున్నారని లేదా దేశాన్ని అస్థిరతకు గురిచేయడానికి విదేశీ నిధులు అందుకుంటున్నారని ముద్ర వేయడం ద్వారా భారత ప్రభుత్వం నిరంతరం జర్నలిస్టులపై దాడులను తీవ్రతరం చేస్తోంది.
ఈ దాడి లక్ష్యాలైన ఆదివాసీల నిర్వాసిత్వం, ప్రజలపై భారత ప్రభుత్వ మారణహోమ యుద్ధంపై వ్రాస్తున్న రూపేష్ కుమార్ సింగ్ వంటి జర్నలిస్టులు చాలా మంది రాజకీయ ఖైదీలు అయారు. అలాంటి వారిలో కొందరు - ‘కశ్మీర్‌వాలా’లో కశ్మీర్‌లో బూటకపు ఎన్‌కౌంటర్ల గురించి రిపోర్టు రాసినందుకు అక్రమ నిర్బంధం పాలైన ఫహద్ షా ఇటీవల విడుదలయ్యారు. కశ్మీర్‌లో జాతీయ విముక్తి పోరాటంపై రెగ్యులర్‌గా రిపోర్టు చేసిన ఆసిఫ్ సుల్తాన్‌ను 5 సంవత్సరాల తర్వాత గత నెల నిర్దోషిగా విడుదలైన 24 గంటల్లోనే తిరిగి అరెస్టు చేసారు. దళిత బాలికపై అత్యాచారం, హత్యలపై రిపోర్టు రాసేందుకు హత్రాస్‌కు వెళ్ళిన సిద్ధిక్ కప్పన్ అనేక సంవత్సరాలు జైలులో ఉన్నారు.ప్రజా పోరాటాలు, డిమాండ్లకు క్షేత్రస్థాయి రిపోర్టు వ్రాసే, భారత రాజ్యం రూపొందించిన కథనాన్ని ధిక్కరించే ప్రతి జర్నలిస్టును ఇరికించడానికి, బెదిరించడానికి,భయపెట్టడానికి చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడుతోంది.
కొంతమందిని క్రూరమైన ఉపా లేదా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్‌ల కింద అరెస్టు లేదా సుదీర్ఘకాలం నిర్బంధానికి లోను చేస్తే, మరికొందరిని దాడుల ద్వారా బలవంతంగా లొంగిపోయేట్లు చేస్తారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న దేశంలోని మొత్తం ప్రజాస్వామిక అవకాశాలతో ముడిపడి ఉంది. ఉపా వంటి కఠినమైన చట్టాల ద్వారానూ, ఎన్ఐఎ-ఇడి వంటి వేటాడే ఏజెన్సీల వల్లనూ ఈ అవకాశాలు వేగంగా తగ్గిపోతున్నాయి.
ప్రజాపర రిపోర్టులు వ్రాసినందుకు అబద్ధపు కేసులతో ఖైదు చేయబడిన జర్నలిస్టులతో సహా రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణ హిందూత్వ ఫాసిస్ట్ భారతీయ రాజ్యం ప్రజాస్వామిక హక్కులను, అసమ్మతిని అణచివేయడానికి వ్యతిరేకంగా విస్తృత ప్రతిఘటనను నిర్మించడంలో పాల్గొనాలని ప్రజలను, ప్రజాస్వామిక జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాం. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ భారత రాజ్య ప్రజాస్వామిక హక్కుల, భిన్నాభిప్రాయాల అణిచివేతకు వ్యతిరేకంగా విస్తృత ప్రతిఘటనను నిర్మించడంలో ప్రజానుకూల, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే జర్నలిస్టులకు పిలుపునిస్తున్నాం.
రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం:
ఎఐఆర్ఎస్ఒ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎమ్, భీమ్ ఆర్మీ, బిఎస్‌సిఇఎమ్, సిఇఎమ్, సిఆర్‌పిపి, సిటిఎఫ్, దిశ, డిఐఎస్‌ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరం అగైన్స్ట్ రిప్రెషన్, తెలంగాణ, ఫ్రటర్నిటీ, ఐఏపిఎల్, ఇన్నోసెన్స్ నెట్‌వర్క్, కర్ణాటక జనశక్తి, ఎల్‌ఎఎ, మజ్దూర్ అధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రిక, మోర్చా పత్రిక, ఎన్‌ఎపిఎమ్, నిశాంత్ నాట్య మంచ్, నౌరూజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయి మంచ్, సమాజ్‌వాది జన్ పరిషద్, సమాజ్‌వాది లోక్ మంచ్, బహుజన్ సమాజ్‌వాది లోక్ మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్, యునైటెడ్ పీస్ అలియన్స్, డబ్ల్యూఎస్ఎస్, వై4ఎస్.